ముక్కోణపు సిరీస్‌కి భారత జట్టు ఎంపిక

  • భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్‌
  • మార్చి 6 నుంచి ప్రారంభం
  • కోహ్లీకి విశ్రాంతి
వచ్చేనెల 6 నుంచి శ్రీలంకలో జరిగే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ ముక్కోణపు టీ20 సిరీస్‌కి బీసీసీఐ భారతజట్టును ఎంపిక చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మందితో భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, సురేష్ రైనా, మనిష్ పాండే, దినేశ్ కార్తీక్, దీపక్ హూడా, వాషింగ్టన్ సుందర్, చాహెల్, అక్సర్ పటేల్, విజయ్ శంకర్‌, శార్దుల్ ఠాకూర్, జయ్‌దేవ్‌, మహమ్మద్ సిరాజ్‌, రిషబ్ పంత్ జట్టులో ఉన్నారు. వెన్నునొప్పితో బాధపడుతోన్న కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. 
Go Back to Shorts
India
Sri Lanka
Bangladesh
Cricket

More Telugu News