అందుకే, నేను కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశాను: శరద్ పవార్
- అప్పుడు, వాజ్‌పేయ్ సర్కారు పడిపోయింది
- 1999లో కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ప్రధాని కావాలనుకున్నారు
- నాకు నచ్చలేదు
- ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలో చాలా మార్పు
ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలో చాలా చక్కని నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయని, ఆయన దేశంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారని అన్నారు. ఏదో నేర్చుకోవాలనే తపన కాంగ్రెస్ అధ్యక్షుడిలో కనపడుతోందని చెప్పారు. కాగా, లోక్‌సభలో మాట్లాడుతూ మోదీ చేస్తోన్న విమర్శలు బాగోలేవని ఆయన అభిప్రాయపడ్డారు. జవహర్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్‌ను మోదీ విమర్శించిన తీరును దుయ్యబట్టారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.