జీఎస్టీ ట్రైలర్ ని తొలగించిన యూట్యూబ్!

  • జీఎస్టీపై యూట్యూబ్ కు ఫిర్యాదు చేసిన రచయిత జై కుమార్
  • ఈ మేరకు యూట్యూబ్ నుంచి ట్రైలర్ తొలగింపు!
  • వర్మను అరెస్టు చేయాలంటూ కొనసాగుతున్న మహిళా సంఘాల నిరసన
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను యూట్యూబ్ నుంచి తొలగించింది. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ స్క్రిప్ట్ తనదేనంటూ ఆరోపణలు చేసిన రచయిత జైకుమార్ ఈ మేరకు యూట్యూబ్ కు గత నెలలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఆ ట్రైలర్ ని యూట్యూబ్ నుంచి తొలగించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఐద్వా మహిళ మణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మను అరెస్టు చేయాలంటూ విశాఖపట్టణంలో మహిళా సంఘాలు తమ నిరసన కొనసాగిస్తున్నాయి.
Go Back to Shorts
god S*x and truth
ram gopal varma
you tube
jai kumar

More Telugu News