కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏక్తా కపూర్
- సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై సోషల్ మీడియాలో పెను దుమారం
- నిర్మాత, నటులపై లైంగిక ఆరోపణలు చేసిన నటీమణులు
- కాస్టింగ్ కౌచ్ అంశంలో నిర్మాతలను వెనకేసుకొచ్చిన ఏక్తా కపూర్
చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం తమంతట తామే నిర్మాతల దగ్గరకు వెళతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పవర్, పొజిషన్ లో ఉన్నారు కదా అని నిర్మాతలను నిందించడం సరికాదని ఏక్తా హితవు పలికింది. ఉదాహరణకు ఒక హీరోయిన్ అర్ధరాత్రి నిర్మాతను కలిసి, తరువాతి రోజు తనకు సినిమాలో అవకాశం ఇవ్వమంటే తప్పెవరిది? అని ప్రశ్నించింది. ఆ సినిమాలో ఆమెకు సెట్ అయ్యే పాత్ర లేనప్పుడు దోషిగా ఎవరిని నిలబెట్టాలి? అని నిలదీసింది. దీంతో బాలీవుడ్ నటీమణులు ఏక్తాపై ఫైర్ అవుతున్నారు.