టీడీపీకి గుడ్ బై చెప్పేద్దాం.. మరొకరు కలవడానికి సిద్ధంగా ఉన్నారు: ఏపీ మంత్రి మాణిక్యాలరావు కీలక వ్యాఖ్యలు
- టీడీపీ తెగదెంపులు చేసుకోక ముందే మనమే బయటకొద్దాం
- ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రానికి ఏమి చేశామో ప్రజలకు చెబుదాం
- రాజీనామాలు చేయాలని అధిష్ఠానం ఆదేశిస్తే నిమిషంలో చేస్తాం
- టీడీపీతో పొత్తు విడిపోతే బీజేపీకి పెద్దగా నష్టం ఉండదు
టీడీపీ తెగదెంపులు చేసుకోక ముందే మనమే బయటకొద్దామని తమ నేతలతో ఇప్పటికే చెప్పానని మాణిక్యాలరావు అన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రానికి ఏమి చేశామో ప్రజలకు చెబుతామని అన్నారు. మంత్రి పదవులకి రాజీనామాలు చేయాలని అధిష్ఠానం ఆదేశిస్తే నిమిషంలో చేస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తు విడిపోతే బీజేపీకి పెద్దగా నష్టం ఉండదని తెలిపారు.