Amrapali: సంప్రదాయ కశ్మీరీ దుస్తుల్లో మెరిసిన ఆమ్రపాలి... కొన్ని పెళ్లి ఫొటోలు!

షార్ట్స్‌లో చూడండి
జమ్మూ కాశ్మీర్ లో వైభవంగా జరిగిన వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కాటా ఆమ్రపాలి రెడ్డి, గోవా ఐపీఎస్ అధికారి సమీర్ శర్మల వివాహానికి వరంగల్ నుంచి పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు తరలి వెళ్లారు. తన నివాసమైన కేసీ రెసిడెన్సీ నుంచి సమీర్ శర్మ బంధు మిత్రులు, స్నేహితులతో కలసి బరాత్ గా కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఆపై అంగరంగ వైభవంగా వివాహం జరుగగా, ఆ పెళ్లి ఫొటోలు కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. సంప్రదాయ కశ్మీరీ దుస్తుల్లో ఆమ్రపాలి మెరిసిపోయారు.

ఎరుపురంగు గాగ్రాకు, అదే కలర్లో, బంగారు రంగు బార్డర్ ఉన్న చోళీని తలపై నుంచి కిందవరకూ కప్పుకుని, రెండు చేతులకూ మణికట్టు వరకూ మ్యాచింగ్ గాజులు, నుదుట పెద్ద పాపిట బిళ్లను ధరించారు. ఇక వరుడు సమీర్, లైట్ క్రీమ్ కలర్ సూట్ లో మెరిసిపోయారు. కాగా, నేటి సాయంత్రం జమ్మూ మార్బుల్‌ మార్కెట్‌ లోని కింగ్స్‌ విల్లేలో విందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి ఆమ్రపాలి స్నేహితురాలు, వరంగల్ కార్పొరేషన్ కమిషనర్‌ శ్రుతి ఓజా, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, వరంగల్ ఎమ్మెల్యే ఎ.రమేష్ తదితరులు హాజరయ్యారు. ఆమ్రపాలి వివాహానికి సంబంధించి కొన్ని ఫొటోలను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Amrapali
Marriage
Sameer Sharma
Warangal

More Telugu News