నష్టాలు తెచ్చిన 'ఇంటిలిజెంట్' .. 5 కోట్లు తిరిగిచ్చేసిన వినాయక్!

  • 27 కోట్లతో రూపొందిన 'ఇంటిలిజెంట్' 
  • 20 కోట్ల వరకూ నష్టాలు
  • మరోమారు సాయపడుతోన్న వినాయక్  
సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ 'ఇంటిలిజెంట్' సినిమాను తెరకెక్కించాడు. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లోకి వచ్చింది. విడుదలైన తొలి రోజునే ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారీస్థాయిలో నష్టాలు వచ్చాయి. దాదాపు 27 కోట్లతో సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మించగా 20 కోట్లవరకూ నష్టాలు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగల్చడంతో, కొంతవరకూ వాళ్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో, పారితోషికంగా తాను తీసుకున్న 9 కోట్లలో నుంచి 5 కోట్లను వినాయక్ వెనక్కి ఇచ్చేశారట. గతంలో 'అఖిల్' సినిమా నష్టాలు తెచ్చిపెట్టినప్పుడు కూడా ఆయన తన పారితోషికంలో సగం వెనక్కి ఇచ్చేశారనే విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయన అదే విధంగా సాయపడుతుండటం విశేషం.  

Go Back to Shorts
sai dharam tej
lavanya tripathi

More Telugu News