ప్రభాస్ తో స్నేహానికి మించి మరేమీలేదు .. అసహనాన్ని వ్యక్తం చేసిన అనుష్క
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ తో స్నేహానికి మించి మరేమీలేదు .. అసహనాన్ని వ్యక్తం చేసిన అనుష్క

  • ప్రభాస్ తో వున్నది స్నేహం మాత్రమే 
  • ప్రేమ వ్యవహారం లేనే లేదు 
  • ఎన్నిసార్లు చెప్పినా అదే ప్రశ్న వేస్తున్నారు  
'బాహుబలి' సినిమా సమయం నుంచి ప్రభాస్ .. అనుష్క ప్రేమలో పడ్డారనీ, త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ పుకార్లను అనుష్క ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తోంది. తమ మధ్య అలాంటిదేం లేదని ఒకటి రెండు సార్లు ప్రభాస్ కూడా చెప్పాడు. అయితే తాజా ఇంటర్వ్యూలోను ప్రభాస్ తో పెళ్లి గురించిన ప్రస్తావన ఎదురుకావడంతో అనుష్క సహనాన్ని కోల్పోయింది.

"నేను .. ప్రభాస్ మంచి స్నేహితులం .. అంతే. అంతకి మించి మా మధ్య మరేమీ లేదు. బాహుబలి .. దేవసేన రొమాన్స్ ను దృష్టిలో పెట్టుకుని, ఏదేదో ఊహించుకోవద్దు. మేం పెళ్లి చేసుకోనున్నట్టు జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. గతంలోను ఈ విషయాన్ని గురించి చాలాసార్లు చెప్పాను. అయినా పదే పదే ఇదే విషయాన్ని గురించి అడుగుతూ విసుగు తెప్పిస్తున్నారు" అంటూ ఆవేశాన్ని వ్యక్తం చేసింది. మొత్తానికి అనుష్క ఈ విషయాన్ని ఈ సారి గట్టిగానే చెప్పేసింది.    
anushka

More Telugu News