నాతో సినిమా చేయడమే వినాయక్ గొప్పతనం: సాయిధరమ్ తేజ్
- వినాయక్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు
- ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టం
- సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను
"వినాయక్ గారు ఈ పాత్రను అద్భుతంగా మలిచారు. చిరంజీవి గారితో 'ఖైదీ నెంబర్ 150' చేసి హిట్ కొట్టిన ఆయన, తదుపరి సినిమా కోసం .. వరుస ప్లాపులతో వున్న నన్ను ఎంచుకోవడం ఆయన గొప్పతనం. పిలిచి మరీ ఈ సినిమాలో ఆయన ఛాన్స్ ఇవ్వడం నా అదృష్టం. ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మరిచిపోలేని ఒక మధురమైన అనుభూతి. నా సినిమాల నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. పైరసీని ప్రోత్సహించకుండా ఈ సినిమాను థియేటర్స్ కి వెళ్లి చూడండి " అని చెప్పుకొచ్చాడు.