చిరూ సాంగ్ రీమిక్స్ కంగారు పెట్టేసింది: లావణ్య త్రిపాఠి
- వినాయక్ దర్శకత్వంలో 'ఇంటిలిజెంట్'
- తేజు సరసన లావణ్య త్రిపాఠి
- 'ఛమక్ ఛమక్ ఛామ్'సాంగ్ రీమిక్స్
"ఈ మధ్య కాలంలో నాకు బాగా సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది. చిరంజీవిగారి 'కొండవీటి దొంగ' సినిమాలోని 'ఛమక్ ఛమక్ ఛామ్' సాంగును రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారు అనగానే చాలా కంగారుపడిపోయాను. చిరంజీవి .. విజయశాంతి స్థాయిలో చేయడం సాధ్యం కాదనిపించింది. తేజు జోడీగా నా స్థాయిలో నేను ఈ రీమిక్స్ కి న్యాయం చేయడానికి ప్రయత్నించాను" అని చెప్పుకొచ్చింది.