వార్డు మెంబర్ గా గెలవడం కూడా చేత కాదు: సోము వీర్రాజుపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్
- వీర్రాజును ఎమ్మెల్సీ చేసింది టీడీపీనే
- అవినీతి పార్టీ ఇచ్చిన పదవిని ఎందుకు తీసుకున్నారు?
- వైసీపీకి అమ్ముడుపోయారు
పార్టీ పేరుతో ఆయన ఎంత వసూలు చేశారో బీజేపీ నేతలే చెబుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వీర్రాజు వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ ను వీర్రాజు ఎందుకు విమర్శించడం లేదని నిలదీశారు. ఆయనది బీజేపీ అజెండానా? లేక వైసీపీ అజెండానా? అని ప్రశ్నించారు.