ఏపీ బీజేపీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసిన అమిత్ షా
- ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి హరిబాబు కొనసాగింపు
- రెండు వారాల్లో ఏపీ బీజేపీ కార్యవర్గం ప్రకటించే అవకాశం
- టీడీపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని హెచ్చరిక
తమ ఆంధ్రప్రదేశ్ నేతలకు భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి హరిబాబును కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఏపీ కార్యవర్గం నియమించుకోవాలని చెప్పారు. దీంతో రెండు వారాల్లో ఏపీ బీజేపీ కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉంది. మిత్రపక్షం టీడీపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని నేతలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే, పార్టీలో గ్రూపులు ప్రోత్సహించవద్దని, పార్టీ విధానాలకు భిన్నంగా వెళితే చర్యలకు కూడా వెనుకాడనంటూ అమిత్ షా హెచ్చరించారు.