Telugudesam: గుంటూరులో కలకలం.. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ఫ్లెక్సీ!

షార్ట్స్‌లో చూడండి
ఇప్పటికే ఏపీలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి ఎలాంటి సహకారం లేదని టీడీపీ నేతలు అంటుంటే, తప్పంతా టీడీపీదే అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూపించడంతో, టీడీపీ నేతల్లో ఆగ్రహం మరింత ఎక్కువైంది. బీజేపీతో తెగదెంపులు చేసుకుందామంటూ పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ లో ఏకంగా చంద్రబాబుకే టీడీపీ నేతలు సూచించారు.

ఈ నేపథ్యంలో గుంటూరులో వెలసిన ఓ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. 'బీజేపీతో పొత్తు - ఇంటికి రాదు విత్తు' అంటూ దాని మీద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. మన గింజలు కూడా మనకు దక్కవు అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
Go Back to Shorts
Telugudesam
BJP
guntur
Telugudesam flexy

More Telugu News