టీమిండియా విజయ లక్ష్యం 270 పరుగులు!

  • డర్బన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మొదటి వన్డే
  • కెప్టెన్ డుప్లెసిస్ 120 పరుగులు
  • కుల్దీప్ యాదవ్‌కి 3, చాహెల్‌కి 2, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌లకి తలో వికెట్
డర్బన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్‌ల మధ్య జరుగుతోన్న తొలి వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ ధాటిగా ఆడి సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లో హషీమ్ ఆమ్లా 16, డికాక్ 34, డుప్లెసిస్ 120, మార్క్‌రం 9, డుమిని 12, డేవిడ్ మిల్లర్ 7, క్రిస్ మేర్రిస్ 37, ఆండిల్ 27 (నాటౌట్), రబాడా 1, మార్కెల్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కి 3, చాహెల్‌కి 2, బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లకి తలో వికెట్ లభించాయి. 
Go Back to Shorts
India
south africa
Cricket

More Telugu News