Samrat Reddy: సామ్రాట్ రెడ్డి ఓ 'గే', డ్రగ్స్ కు బానిస: భార్య హర్షిత సంచలన ఆరోపణ

  • హుక్కా సెంటర్లు తిరుగుతూ డ్రగ్స్ తీసుకుంటాడు
  • కామన్ ఫ్రెండ్స్ ద్వారా గే అని తెలిసింది
  • శారీరకంగా, మానసికంగా ఎన్నో వేధింపులు
  • ఓ టీవీ చానల్ తో హర్షిత
తన భర్త సామ్రాట్ రెడ్డికి ఎంతో మంది మగ స్నేహితులు ఉన్నారని, అతనికి, నాకు ఉన్న కామన్ ఫ్రెండ్స్ ద్వారా తన భర్త ఓ 'గే' అని తెలుసుకుని హతాశురాలినయ్యానని హర్షిత వ్యాఖ్యానించింది. తన భర్త దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, ఈ ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, బయటకు వెళ్లినప్పుడు, కారు డ్రైవింగ్ సీట్లో తనను కూర్చోబెట్టి, లేడీ డ్రైవర్ మాదిరిగా చూస్తుండేవాడని ఆరోపించింది.

బయటకు తీసుకువెళ్లిన సమయంలో తనతో బాగున్నట్టు నాటకాలు ఆడుతూ, ఇంటికి వచ్చిన తరువాత శారీరకంగా, మానసికంగా వేధించేవాడని తెలిపింది. అతని గురించి ఎన్ని విషయాలు తెలిసినా, మనసులో బాధపడ్డానే తప్ప బయట పడలేదని, ఎప్పటికైనా మారుతారన్న ఆశతో చాన్నాళ్లు ఎదురు చూశానని హర్షిత చెప్పింది. తన తండ్రి షేర్లను ట్రాన్స్ ఫర్ చేసేందుకు అంగీకరించకపోవడంతో, గత ఏడాదిగా వేధింపులు ఎక్కువయ్యాయని వెల్లడించింది.

తన పక్కనే కూర్చుని రాత్రంతా చాటింగ్ లు చేస్తుండేవాడని, అడిగితే కొట్టేవాడని ఆరోపించింది. ఎప్పుడూ హుక్కా సెంటర్లలో తిరుగుతుంటాడని, తనకు ఆ వాసన పడదని చెప్పినా వినడని, గంటలు గంటలు కూర్చుని, హుక్కా, డ్రగ్స్ తీసుకునేవాడని ఏడుస్తూ చెప్పింది. ఖర్చులకు కావాల్సిన డబ్బుల కోసం తనతో ఉద్యోగం కూడా చేయించాడని, ఇంట్లో కూర్చుని డబ్బులకు వేధించేవాడని ఆరోపించింది. తన సేఫ్టీ కోసం తన తండ్రి సీసీటీవీ కెమెరాలను ఇంట్లో పెట్టించడం వల్లే, సామ్రాట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం లభించిందని తెలిపింది. 
Samrat Reddy
Harshita
Tollywood
Arrest
Police

More Telugu News