చివరిటెస్టు రెండో ఇన్నింగ్స్‌: దక్షిణాఫ్రికా స్కోరు 42/1

  • మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 187, దక్షిణాఫ్రికా 194
  • రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 247 పరుగులకి ఆలౌట్
  • క్రీజులో ఎల్గర్ (17), హషిమ్ ఆమ్లా (12)
  • రెండో ఇన్నింగ్స్‌లో మరో 199 పరుగులు చేస్తే సౌతాఫ్రికా గెలుపు
జోహన్స్‌బర్గ్‌లో జరుగుతోన్న ద‌క్షిణాఫ్రికా, భారత్ చివ‌రి టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్స్ లో భారత్ నిన్న 247 పరుగులకి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 17 ఓవర్లకి ఒక వికెట్ నష్టానికి 42గా ఉంది. మార్క్‌రమ్ 4 పరుగులకే షమీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్ 17, హషిమ్ ఆమ్లా 12 పరుగులతో ఉన్నారు. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 187 పరుగులకి ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 194 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా గెలవాలంటే మరో 199 పరుగులు చేయాల్సి ఉంది. 
Go Back to Shorts
India
south africa
Cricket

More Telugu News