ప్రారంభానికి ముందే రికార్డు సృష్టించిన ఐపీఎల్... ఆటగాళ్ల రిటెన్షన్ ఈవెంట్‌కి రికార్డు స్థాయిలో వీక్షణలు
- వివరాలను వెల్లడించిన బార్క్
- హాట్‌స్టార్ ద్వారా తిలకించిన 4 మిలియన్ల మంది
- అదేరోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచిన ఐపీఎల్ 2018
తొలిసారి ఈ ఈవెంట్‌ను స్టార్ ఇండియా టెలివిజన్ నెట్‌వర్క్‌కి చెందిన స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ వేడుకను టెలివిజన్ల ద్వారా 4.1మిలియన్ల మంది, డిజిటల్ ప్లాట్‌ఫాం హాట్‌స్టార్ ద్వారా 4 మిలియన్ల మంది తిలకించారని బార్క్ ప్రతినిధులు తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆ రోజు ఐపీఎల్-2018 ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచింది. జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనున్న సంగతి తెలిసిందే.