భోజన విరామ సమయానికి 8 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 141 పరుగులతో క్రీజులో కోహ్లీ
- దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో రెండో టెస్టు
- మొదటి ఇన్నింగ్స్‌లో మరో 48 పరుగులు వెనకబడి ఉన్న భారత్
- ప్రస్తుతం టీమిండియా స్కోరు 287/8 (85 ఓవర్లకి)
- క్రీజులో కోహ్లీతో పాటు ఇషాంత్ శర్మ
అశ్విన్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన షమీ ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. భోజన విరామ సమయానికి క్రీజులో కోహ్లీ 141, ఇషాంత్ శర్మ 0 పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కెల్ రెండు వికెట్లు తీయగా కేశవ్ మహరాజ్, రబాడా, గిడి లకు తలో వికెట్ దక్కాయి. ప్రస్తుతం స్కోరు 287/8 (85 ఓవర్లకి)గా ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా కంటే భారత్ మరో 48 పరుగులు వెనకబడి ఉంది.