south africa: సెంచూరియన్ టెస్టు..వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

దక్షిణాఫ్రికా - భారత్ జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు పోగొట్టుకుంది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (10), ఛటేశ్వర్ పుజారా డక్కౌట్ అయ్యారు. 9.3 ఓవర్లో మోర్నీ మోర్కెల్ వేసిన బంతిని కొట్టిన రాహుల్ నేరుగా బౌలర్ కే క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పుజారా మోర్కెల్ వేసిన నాల్గో బంతిని కొట్టి పరుగు చేద్దామనుకున్నాడు. సహ బ్యాట్స్ మెన్ మురళీ విజయ్ స్పందించకపోయినప్పటికీ ఈ పరుగు చేసేందుకు పుజారా తొందరపడ్డాడు. తన తప్పు తెలుసుకుని వెనక్కి పరిగెత్తే లోపే ఎంగిడి వేసిన త్రో వికెట్లకు తాకడంతో రన్ ఔటయ్యాడు. కాగా, ప్రస్తుతం క్రీజ్ లో విజయ్, కోహ్లీ ఉన్నారు. 28 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ : 80/2
south africa
team india
Cricket

More Telugu News