వారం రోజుల టైమడిగిన ప్రదీప్.. రెండు రోజులు ఇచ్చిన పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వారం రోజుల టైమడిగిన ప్రదీప్.. రెండు రోజులు ఇచ్చిన పోలీసులు

  • కోర్టుకు హాజరయ్యేందుకు సమయం కావాలన్న ప్రదీప్
  • షూటింగులతో బిజీగా ఉన్నానంటూ అభ్యర్థన
  • రెండు రోజుల గడువుకు ఓకే చెప్పిన పోలీసులు
కొత్త సంవత్సరం మజాను ఆస్వాదిస్తూ మద్యం తాగి పోలీసులకు చిక్కి కష్టాల పాలైన బుల్లితెర యాంకర్ ప్రదీప్, కోర్టుకు రావడానికి తనకు సమయం  కావాలంటూ పోలీసులను వేడుకున్నాడు. ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న కార్యక్రమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నానని, కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టుకు హాజరు కాలేనని పోలీసులకు విన్నవించుకున్నాడు. తనకు కనీసం వారం రోజుల గడువు ఇవ్వాల్సిందిగా కోరాడు. అతడి అభ్యర్థనపై స్పందించిన జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రెండు రోజుల గడువు మాత్రమే ఇచ్చినట్టు సమాచారం.

సోమవారం గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు ప్రదీప్ హాజరయ్యాడు. మంగళవారం కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉండగా డుమ్మా కొట్టాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ప్రదీప్‌కు మరోమారు నోటీసులు పంపారు. దీంతో బుధవారం నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టుకు ప్రదీప్ తప్పకుండా హాజరవుతాడని అందరూ భావించారు. అయితే మరోమారు డుమ్మా కొట్టాడు. తాను షూటింగులతో బిజీగా ఉన్నానని, తనకు వారం రోజులు సమయం కావాలని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులను కోరాడు. అయితే వారు రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. మరి ఈసారైనా ప్రదీప్ కోర్టుకు హాజరవుతాడో? లేదో? వేచి చూడాల్సిందే.  
Anchor
Pradeep
police
Hyderabad

More Telugu News