జరిమానా? జైలు శిక్షా?... నేడు న్యాయమూర్తి ముందుకు యాంకర్ ప్రదీప్

  • మరికాసేపట్లో న్యాయమూర్తి ముందుకు ప్రదీప్
  • డిసెంబర్ 31న దొరికిపోయిన ప్రముఖ యాంకర్
  • బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 150 దాటితే జైలుకే!
డిసెంబర్ 31వ తేదీ రాత్రి తప్పతాగి, పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికి పోయిన ప్రముఖ యాంకర్, నటుడు ప్రదీప్, నేడు న్యాయస్థానం ముందు హాజరు కానున్నాడు. అతనికి జరిమానా విధించి సరిపెడతారా? లేదా జైలు శిక్ష విధిస్తారా? అన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.

ఇటీవలి కాలంలో 150 పాయింట్లకు మించి రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్టు తేలితే, రెండు రోజుల నుంచి వారం రోజుల వరకూ జైలు శిక్ష విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రదీప్ కు కూడా జైలు శిక్ష విధిస్తారని కొందరు భావిస్తుండగా, ఆయన నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే సమాజ సేవ లేదా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరికాసేపట్లో ప్రదీప్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందుకు రానున్నాడు.
Go Back to Shorts
Pradeep
Anchor
Drunken Drive
Court

More Telugu News