చంద్రబాబు సర్కారు వేటు... గజల్ శ్రీనివాస్ కు మరో షాక్!
- ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తొలగింపు
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
- లైంగిక ఆరోపణల నేపథ్యంలో పదవికి అర్హుడు కాదన్న అధికారులు
ఈ క్రమంలో తాజాగా, ఆంధ్రప్రదేశ్ సర్కారు సైతం షాకిచ్చింది. గజల్ శ్రీనివాస్ ను ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తొలగిస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. గజల్ శ్రీనివాస్ పై వచ్చిన ఆరోపణలు, కనిపిస్తున్న సాక్ష్యాల నేపథ్యంలో, ఈ పదవికి ఆయన అర్హుడు కాదన్న నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. గజల్ శ్రీనివాస్ ను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.