lavanya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

షార్ట్స్‌లో చూడండి
*  సాయి ధరం తేజ్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయిక లావణ్య త్రిపాఠి మిలియనీర్ అమ్మాయిగా నటిస్తోంది. దీంతో ఆమె గెటప్.. స్టయిల్ అన్నీ చాలా పోష్ గా ఉంటాయట. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.
*  మంచు లక్ష్మి నటించిన హాలీవుడ్ చిత్రం 'బాస్మతి బ్లూస్' ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ, ఈ చిత్రం త్వరలో విడుదల కానుందని పేర్కొంది. డాన్ బారన్ దీనికి దర్శకత్వం వహించాడు.  
*  ఇటీవల 'వైశాఖం' చిత్రాన్ని రూపొందించిన దర్శకురాలు బి.జయ తన తదుపరి చిత్రాన్ని జూన్ నుంచి చేయనున్నారు. ఆర్జే సినిమాస్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని చిత్ర నిర్మాత బి.ఏ.రాజు చెప్పారు.    
*  రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా తెలుగులో వచ్చిన 'కుమారి 21 ఎఫ్' చిత్రాన్ని అదే పేరుతో తాజాగా కన్నడలో రీమేక్ చేశారు. శ్రీమన్ వేముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. 
Go Back to Shorts
lavanya
manchu
jaya
hebba Patel

More Telugu News