వారం రోజుల పాటు తెలుగులో డబ్బింగ్ చెప్పిన సూర్య!
- వారం పాటు కష్టపడి డబ్బింగ్ చెప్పిన నటుడు
- చిత్రం పేరు 'గ్యాంగ్'
- హీరోయిన్ కీర్తి సురేశ్
సాధారణంగా తమిళ డబ్బింగ్‌ను సూర్య ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేస్తారట. కానీ తెలుగు డబ్బింగ్ కోసం దాదాపు వారం రోజుల పాటు సూర్య కష్టపడ్డారట. తెలుగు పలికే విధానం బాగా రావడం కోసం చాలా ప్రయత్నం చేశారట. ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. గతంలో 'బ్రదర్స్' చిత్ర తెలుగు వెర్షన్‌కి కూడా సూర్య డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నించారు. కానీ పూర్తిస్థాయిలో చెప్పలేకపోయారు. ఇప్పటివరకు సూర్య చిత్రాలన్నింటికీ శ్రీనివాసమూర్తి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గాత్రదానం చేసేవారు.