పరారీలో యాంకర్ ప్రదీప్... అధికారికంగా ప్రకటించిన పోలీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పరారీలో యాంకర్ ప్రదీప్... అధికారికంగా ప్రకటించిన పోలీసులు!

  • డిసెంబర్ 31న అడ్డంగా దొరికిపోయిన ప్రదీప్
  • రెండు రోజుల నుంచి కౌన్సెలింగ్ కు గైర్హాజరు
  • ఇంటికి వెళితే తాళం
  • నేడు రాకుంటే లా అండ్ ఆర్డర్ విభాగానికి కేసు
డిసెంబర్ 31 రాత్రి పోలీసులు జరిపిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యాంకర్, నటుడు మాచిరాజు ప్రదీప్ (35) ప్రస్తుతం పరారీలో ఉన్నాడని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. ఆయన 2వ తేదీనే ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటరుకు తల్లి లేదా భార్య లేదా సమీప బంధువుతో సహా కౌన్సెలింగ్ కు హాజరు కావాల్సి వున్నా, ఆయన రాలేదని, తాము పోలీసులను ఆయన చెప్పిన మణికొండలోని చిరునామాకు పంపించగా, ఇంటికి తాళం వేసి ఉందని చెప్పారు.

ప్రదీప్ కార్యాలయం కూకట్ పల్లిలో ఉందని గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా వెళ్లారని, ఆయన ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు అందించిన రిపోర్టులో ఫిర్యాదు చేశామని, గురువారం కూడా ప్రదీప్ కౌన్సెలింగ్ కు రాకపోతే లా అండ్ ఆర్డర్ పోలీసులకు విషయం తెలియజేస్తామని, తదుపరి చర్యలను వారే తీసుకుంటారని ట్రాఫిక్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
Pradeep
Drunken Drive
Hyderabad
Police

More Telugu News