కౌన్సెలింగ్ కు రాని యాంకర్ ప్రదీప్... పోలీసులను పంపిన అధికారులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కౌన్సెలింగ్ కు రాని యాంకర్ ప్రదీప్... పోలీసులను పంపిన అధికారులు!

  • డిసెంబర్ 31 రాత్రి మందు కొట్టి దొరికిపోయిన ప్రదీప్
  • నేడు కౌన్సెలింగ్ కు హాజరు కాని యాంకర్
  • విషయాన్ని చార్జ్ షీట్ రిపోర్టులో చేరుస్తామంటున్న పోలీసులు
డిసెంబర్ 31 రాత్రి పూటుగా తాగి జూబ్లీహిల్స్ ఏరియాలో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన బుల్లితెర యాంకర్, నటుడు ప్రదీప్, నేడు కౌన్సెలింగ్ కు హాజరు కాలేదు. ప్రదీప్ ను బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో జరిగే కౌన్సెలింగ్ కు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశించినా, ఆయన ఉదయం 11 గంటల వరకూ హాజరు కాలేదని బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ బలవంతయ్య తెలిపారు.

సాంకేతికంగా ఆయనకు శనివారం వరకూ కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు సమయం ఉన్నప్పటికీ, దొరికిపోయిన రెండు రోజుల్లోపే కౌన్సెలింగ్ ను పూర్తి చేస్తున్నామని, ప్రదీప్ కోసం ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను సైతం పంపించామని ఆయన చెప్పారు. నేడు కౌన్సెలింగ్ కు హాజరు కాకుంటే, ఈ విషయాన్ని కూడా చార్జ్ షీట్ రిపోర్టులో చేరుస్తామని అన్నారు. కాగా, బ్రీత్ అనలైజర్ టెస్టులో ప్రదీప్ కు 178 రీడింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు రెండు రోజులు లేదా వారం రోజుల జైలు శిక్ష తప్పదని సమాచారం.
Pradeep
Drunken Drive
New Year

More Telugu News