డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు రేపు కౌన్సెలింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు రేపు కౌన్సెలింగ్!

  • బేగంపేటలోని కౌన్సెలింగ్ సెంటర్ కు రావాలని పోలీస్ ఆదేశాలు
  • సుమారు 3 గంటల పాటు కౌన్సెలింగ్ ఉంటుందట
  • అనంతరం కోర్టుకు..వారానికి పైగా శిక్ష పడే అవకాశాలు?
డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ ప్రముఖ యాంకర్ ప్రదీప్ కు పోలీసులు రేపు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. బేగంపేటలోని కౌన్సెలింగ్ సెంటర్ కు రేపు హాజరుకావాల్సిందిగా అతన్ని ఆదేశించారు. సుమారు 3 గంటల పాటు ప్రదీప్ కు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మూడు డాక్యుమెంటరీల ప్రదర్శనతో పాటు నిపుణుల కౌన్సెలింగ్ ఉంటుందని సమాచారం.

అనంతరం, ప్రదీప్ ను కోర్టులో హాజరుపరుస్తారని, వారం రోజుల కంటే ఎక్కువగానే అతనికి శిక్ష పడే అవకాశముందని తెలుస్తోంది. అలాగే, ప్రదీప్ తన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లు తొలగించకపోవడంపై కూడా మరో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. కాగా, గత రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 45లో జరిగిన తనిఖీల్లో ప్రదీప్ దొరికిపోయాడు. ఓ పబ్బులో మందు కొట్టి వచ్చి తన 'టీఎస్ 07 ఈయూ 6666' కారులో డ్రైవింగ్ చేస్తూ బయలుదేరాడు. జూబ్లీహిల్స్ లో తనిఖీల్లో ప్రదీప్ దొరికిపోయాడు.
anchor pradeep
juble hills

More Telugu News