Balakrishna: హిందూపురంలో క్రికెట్ ఆడి అలరించిన బాలయ్య!

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ క్రికెట్ ఆడి అలరించారు. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటన సందర్భంగా ఆయన బసవతారకం మెమోరియల్ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. స్థానిక ఎంజీఎం స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతోంది. ఈ సందర్భంగా  కాసేపు క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు బాలయ్య. అనంతరం కరచాలనం చేస్తూ, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, మాససిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
Balakrishna
basabatharakam memorial cricket

More Telugu News