దక్షిణాఫ్రికా బయల్దేరిన విరాట్ - అనుష్క జంట... న్యూఇయర్ అక్కడే!
- ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన విరుష్క
- ఇతర క్రికెటర్లు, వారి కుటుంబాలు కూడా
- జనవరి మొదటి వారంలో తిరిగి రానున్న అనుష్క
జనవరి 5 నుంచి ఫిబ్రవరి 24 వరకు భారత జట్టు, దక్షిణాఫ్రికాతో ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. భారత ఆటగాళ్లందరూ న్యూఇయర్ వేడుకలను అక్కడే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి మొదటివారంలో అనుష్క తిరిగి రానుంది. వచ్చాక ఆనంద్ ఎల్ రాయ్ సినిమాలో షారుక్ సరసన నటిస్తున్న సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొంటుంది. అలాగే తాను స్వయంగా నిర్మించిన 'పరి' చిత్ర ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొననుంది.