విరుష్క రెండో రిసెప్షన్‌కి అతిథులు వీరే!
- క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖుల హాజరు
- పారిశ్రామిక వేత్తలు కూడా
- ఆమిర్ ఖాన్ కష్టమే!
విరాట్ తరఫున క్రికెటర్లు, అనుష్క తరఫున బాలీవుడ్ నటీనటులకు ప్రత్యేకంగా ఈ రిసెప్షన్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆహ్వానపత్రికలను అనుష్కతో పనిచేసిన హీరోలు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలకు అందజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ బిజీ కారణంగా ఆమిర్ ఖాన్ వంటి వారు రాలేకపోవచ్చు. అలాగే క్రికెట్ రంగంలో కూడా అందరికీ ఆహ్వానాలు అందాయట.
ఢిల్లీలో జరిగిన రిసెప్షన్‌కి క్రికెటర్లు ధావన్, సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్ తమ కుటుంబసభ్యులతో సహా హాజరైన సంగతి తెలిసిందే. వారు ఈ రిసెప్షన్‌కి కూడా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి తదితరులు విందుకు హాజరుకానున్నారు. అంతేకాకుండా ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, అనుష్క, విరాట్‌లు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న బ్రాండింగ్ సంస్థల యజమానులు కూడా హాజరయ్యే అవకాశముంది.