sundeepkishan: సందీప్ కిషన్ కి హిట్ తెచ్చిపెట్టిన 'మాయావన్'

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో అవకాశాలు తక్కువగానే వున్నా, తాను చేస్తోన్న తమిళ సినిమాలు తెలుగులో విడుదలయ్యేలా సందీప్ కిషన్ చూసుకుంటున్నాడు. అలా తమిళంలో ఆయన చేసిన 'మా నగరం' ..'నగరం' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో ఈ సినిమా హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఆ తరువాత వచ్చిన 'కేరాఫ్ సూర్య' సినిమా కూడా అక్కడ మంచి మార్కులు సంపాదించుకుంది.

 ఈ రెండు సినిమాలు తెలుగులో ఓ మాదిరిగానే ఆడాయి. ఈ నేపథ్యంలో తమిళంలో సందీప్ కిషన్ తాజా చిత్రంగా ఇటీవలే 'మాయావన్' విడుదలైంది. సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్కడ విజయవిహారం చేస్తోంది. ఈ సినిమాతో ఈ ఏడాది చివరిలోను హిట్ ను సొంతం చేసుకున్నందుకు సందీప్ కిషన్ ఫుల్ ఖుషీ అవుతున్నాడట. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను, త్వరలోనే 'ప్రాజెక్టు Z' పేరుతో తెలుగులోను విడుదల చేయనున్నారు. ఇక్కడ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.  
Go Back to Shorts
sundeepkishan
lavanya thripathi

More Telugu News