దొంగను పట్టించిన నయనతార ఫొటో... బీహార్ పోలీసుల వలపు వల ఫలించిన వైనం!
- వినూత్న ప్లాన్ వేసి సక్సెస్ అయిన పోలీసులు
- బీజేపీ నేత మొబైల్ దొంగిలించిన దొంగ
- తియ్యని మాటలు చెబుతూ, నయనతార ఫొటోను చూపిన లేడీ ఎస్ఐ
- ఫోటో చూసి పడిపోయి బుక్కయిన దొంగ
ఆపై అతనిపై ఏఎస్ఐగా పనిచేస్తున్న మధుబాలాదేవితో వలపు వల విసిరేయించారు. తొలుత తనకు పోలీసులే ఫోన్ చేస్తున్నారని హసైన్ భయపడ్డా, నాలుగైదు రోజుల పాటు ఆమె తియ్యని మాటలు చెప్పడంతో పడిపోయాడు. కలవాలని ఉందని చెబితే, అప్పటికే వలపు మత్తులో మునిగిన హసైన్, ఫొటో పంపించాలని కోరాడు. దీంతో మధుబాల వెతికి వెతికి మరీ నయనతార ఫొటోను ఎంపిక చేసి పంపించింది. ఆపై వెంటనే ఫ్లాట్ అయిపోయిన హసైన్, ఆమె చెప్పిన చోటికి, చెప్పిన టైమ్ కు వచ్చేశాడు. అప్పటికే అక్కడ సివిల్ దుస్తుల్లో మకాం వేసిన పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ విధంగా నయనతార దొంగను పట్టించినట్లయింది.