అర్ధ సెంచ‌రీ సాధించిన లోకేశ్ రాహుల్‌!

క‌టక్ వేదిక‌గా జ‌రుగుతోన్న‌ భారత్‌, శ్రీలంక మొద‌టి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 13 బంతులు ఎదుర్కున్న రోహిత్ శ‌ర్మ 17 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద మాథ్యూస్ బౌలింగ్ లో చ‌మీరాకు క్యాచ్ ఇచ్చుకుని వెనుదిరిగాడు. ధాటిగా ఆడిన లోకేశ్ రాహుల్ 34 బంతుల్లో అర్ధ సెంచ‌రీ సాధించాడు. ప్ర‌స్తుతం క్రీజులో లోకేశ్ రాహుల్ 50, శ్రేయాస్ అయ్య‌ర్ 15 ప‌రుగుల‌తో ఉన్నారు. భార‌త్ స్కోరు 10 ఓవ‌ర్ల‌కి ఒక వికెట్ న‌ష్టానికి 84 ప‌రుగులుగా ఉంది.  
Go Back to Shorts
lokesh rahul
Cricket
India
Sri Lanka

More Telugu News