కోహ్లీ.. ఇదేనా నీ దేశభక్తి?.. ప్రశ్నించిన బీజేపీ నేత
- ఈ నేలపై డబ్బులు సంపాదించి విదేశాల్లో కోట్ల ఖర్చుతో పెళ్లా?
- దేశంపై నీకు ఏమాత్రం గౌరవం లేదన్న సంగతి తెలిసిపోతోంది
- విరుచుకుపడిన ఎమ్మెల్యే పన్నాలాల్
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విక్రమాదిత్యుడు ఈ నేలపైనే పెళ్లి చేసుకున్నారని, కోహ్లీ మాత్రం విదేశాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వివాహం చేసుకున్నాడని విమర్శించారు. కోహ్లీ దేశభక్తికి ఇది నిదర్శనమని వ్యంగ్యంగా అన్నారు. కాగా, ఆయన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఆయనకు మద్దతు పలికితే మరికొందరు మాత్రం ఎవరు ఎక్కడ పెళ్లి చేసుకోవాలో కూడా బీజేపీనే నిర్ణయిస్తుందా? అని విరుచుకుపడుతున్నారు.