చరణ్ మాస్ ఎంటర్టైనర్లో కీలకపాత్రలో రమ్యకృష్ణ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చరణ్ మాస్ ఎంటర్టైనర్లో కీలకపాత్రలో రమ్యకృష్ణ!

  • బోయపాటితో చరణ్ మూవీ 
  • కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ 
  • విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్
  • జనవరి 2వ వారంలో రెగ్యులర్ షూటింగ్          
చరణ్ కథానాయకుడిగా బోయపాటి ఒక సినిమా తెరకెక్కించనున్నాడు. మాస్ ఆడియన్స్ ఆశించే అన్నిరకాల అంశాలతో బోయపాటి ఈ కథను సిద్ధం చేశాడట. జనవరి 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ పేరు కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటించనున్నట్టు నిన్ననే ఒక వార్త బయటికి వచ్చింది.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలకమైన పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సీనియర్ కథానాయికలకు మంచి పవర్ ఫుల్ రోల్స్ దక్కుతున్నాయి. 'అత్తారింటికి దారేది' సినిమాలో నదియాకి మంచి పాత్ర పడగా, 'అజ్ఞాతవాసి' సినిమాలో ఖుష్బూ కి కూడా అదే తరహా పాత్ర పడింది. ఇక 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లో భూమికకి చాలా ముఖ్యమైన పాత్ర లభించింది. అలా చరణ్ సినిమాలో రమ్యకృష్ణ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందనీ, ఈ సినిమాకి ఆమె పాత్ర హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.        
charan
boyapati

More Telugu News