సీన్ మారుతోంది... రెండు, మూడు రౌండ్ల తరువాత స్పీడ్ గా బీజేపీకి దగ్గరైన కాంగ్రెస్... సీఎం విజయ్ రూపానీ వెనుకంజ!
- తొలి రౌండ్ లో దూసుకెళ్లిన బీజేపీ
- ఆపై పుంజుకున్న కాంగ్రెస్
- రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 9 సీట్లు మాత్రమే
తొలి రౌండ్ లో 105 స్థానాల్లో ఆధిక్యం చూపిన బీజేపీ, రెండు, మూడు రౌండ్ల తరువాత 16 స్థానాల్లో వెనక్కు వెళ్లిపోయింది. క్షణక్షణం మారుతున్న గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఏ వైపు మొగ్గు చూపిస్తాయోనన్న విషయం ఇప్పడు సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ లో 30 అసెంబ్లీ నియోజకవర్గాల సరళి తెలుస్తుండగా, బీజేపీ 19, కాంగ్రెస్ 12 చోట్ల ముందంజలో వున్నాయి.