YSRCP: 500 కి.మీ. పాద‌యాత్ర పూర్తి చేసిన వైఎస్‌ జ‌గ‌న్‌!

షార్ట్స్‌లో చూడండి
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రారంభించిన పాద‌యాత్ర నేటితో 500 కిలో మీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ రోజు జ‌గ‌న్ అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం మండ‌లం గొట్లూరులో త‌న పాద‌యాత్ర కొన‌సాగించారు. త‌న పాద‌యాత్ర 500 కిలోమీట‌ర్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఆయన ఓ మొక్క‌నాటారు.

రేపు తుమ్మల, తిప్పేపల్లి క్రాస్‌, రావులచెరువు ఎస్సీ కాలనీల మీదుగా ప్రజాసంకల్పయాత్రను ఆయన కొన‌సాగిస్తారు. రేపు ఉదయం 11 గంటలకు రావులచెరువు గ్రామంలో త‌మ‌ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, రాష్ట్ర స‌ర్కారుని విమ‌ర్శిస్తూ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. 
Go Back to Shorts
YSRCP
Jagan
padayathra

More Telugu News