హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో వైఎస్ జగన్!
- అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు
- అనంతపురం నుంచి నిన్న సాయంత్రమే హైదరాబాద్‌కు జగన్
- ఈ రోజు సాయంత్రం 4గంటల వరకు కోర్టులోనే వైసీపీ అధినేత
- అనంతరం తిరిగి అనంతపురానికి
విచారణ పూర్తయిన తరువాత మళ్లీ జగన్ పాదయాత్ర కోసం అనంతపురం వెళ్లనున్నారు. వ్యక్తిగత హాజరును మినహాయించాలని గతంలో జగన్ వేసిన పిటిషన్‌ను కోర్టు అంగీకరించని విషయం తెలిసిందే. దీంతో జగన్ ప్రతి శుక్రవారం విచారణ కోసం కోర్టుకు హాజరుకావలసి వస్తోంది.