మరో రెండు.. వైరల్ అవుతున్న హార్ధిక్ పటేల్ సెక్స్ టేపులు!
- వెలుగులోకి మరో రెండు వీడియోలు
- బీజేపీ మార్ఫింగ్ చేసిందన్న ‘పాస్’
- వీటిని ప్రసారం చేయవద్దంటూ మీడియాకు వేడుకోలు
మహిళతో తాను ఏకాంతంగా ఉన్న వీడియోలను బీజేపీ విడుదల చేసే అవకాశం ఉందని, గుజరాత్ ఎన్నికల ముందు బీజేపీ ఆ పనిచేస్తుందని హార్ధిక్ గతంలో చెప్పారు. అంతేకాదు, ఇటువంటివి మరిన్ని వీడియోలను విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అప్పట్లో హార్ధిక్ పేర్కొన్నారు. అయితే తాజా వీడియోలపై స్పందించేందుకు హార్ధిక్ అందుబాటులోకి రాలేదు.
తాజా వీడియోలు గతంలో విడుదల చేసి వాటికి కొనసాగింపుగా ఉన్నాయి. వీటిలో హార్ధిక్ మరో ఇద్దరితో కలిసి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నారు. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత మిగతా ఇద్దరూ బయటకు వెళ్లిపోగా హార్ధిక్ ఒక్కడే లోపల ఉన్నాడు. తాజా వీడియోపై పటీదార్ అనామత్ ఆందోళన సమితి కో కన్వీనర్ దినేశ్ బంభానియా మాట్లాడుతూ ఇది డాక్టరింగ్ (మార్ఫింగ్) చేసిన వీడియో అని పేర్కొన్నారు. ఈ వీడియోల్లో ఉన్నది అవాస్తవమని తాము పదపదే చెబుతున్నామని, బీజేపీనే వీటిని డాక్టరింగ్ చేసిందని ఆరోపించారు. వీడియోలను ప్రసారం చేయవద్దని మీడియోను కోరారు.