akbaruddin oyc: అక్బ‌రుద్దీన్ ఒవైసీ.. మరి కొన్ని నెలల్లోనే నీలాంటి వారికి సమాధానం వస్తుంది: స్వామి ప‌రిపూర్ణానంద

షార్ట్స్‌లో చూడండి
అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణంపై రాష్ట్రీయ హిందూ సేన వ్య‌వ‌స్థాప‌కుడు స్వామి ప‌రిపూర్ణానంద స్పందించారు. తాజాగా ఆయ‌న ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ బాబర్ ఈ దేశం మీద దాడులు చేసి, దోచుకున్నాడ‌ని, అలాగే గ‌జనీ మొహమ్మద్, ఖిల్జీ, హుమయున్ వంటి వారు వందలమంది ఈ దేశంపై పడి దండయాత్రలు చేసి దోచుకున్నారని ఆయ‌న అన్నారు.

కాని నామరూపాలు లేకుండా పోయారని, కాల గర్భంలో కలసిపోయారని తెలిపారు. ఎంఐఎం నేత అక్బ‌రుద్దీన్ ఒవైసీ ఇటీవ‌ల మాట్లాడుతూ రాముడు ఎక్క‌డ ఉన్నాడు? అని అన్నార‌ని ప‌రిపూర్ణానంద‌ తెలిపారు. అక్బరుద్దీన్ లాంటి వారికి మరి కొన్ని నెలల్లోనే సమాధానం వస్తుందని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం తప్పక జరిగి తీరుతుందని ఉద్ఘాటించారు.
Go Back to Shorts
akbaruddin oyc
swamy paripurnananda
ram mandir

More Telugu News