అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప‌ర్య‌టనపై చైనా అభ్యంత‌రం!
Add ap7am to your home Screen

అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప‌ర్య‌టనపై చైనా అభ్యంత‌రం!

  • ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించిన నిర్మలా సీతారామన్‌పై చైనా ఆగ్ర‌హం
  • తాజాగా కోవింద్ పై మండిపాటు
  • అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కోవింద్‌ జరిపిన కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నాం
ఇటీవల రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించిన నేప‌థ్యంలో.. ఆమె ప‌ర్య‌ట‌న‌పై చైనా విమ‌ర్శలు చేసిన విష‌యం తెలిసిందే. నిన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప‌ర్య‌టించ‌డం ప‌ట్ల కూడా చైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కోవింద్‌ జరిపిన కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యానించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌గా చెప్పుకొనే ప్రాంతాన్ని చైనా ఎప్పుడూ ధ్రువీకరించలేదు అని పేర్కొంది. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.  
China
arunachal pradesh
Ram Nath Kovind

More Telugu News