ఆ గాడిదల పేర్లు గుర్మీత్ రాంరహీం సింగ్, హనీప్రీత్ సింగ్.. సంతలో విక్రయం!
- మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో జరిగే గాడిదల సంతలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, హనీప్రీత్ సింగ్ లకు తీవ్ర అవమానం
- గాడిదలకు గుర్మీత్, హనీప్రీత్ ల పేర్లు పెట్టిన యజమాని
- 11,000 రూపాయలకు విక్రయం
ఆయన తన రెండు గాడిదలకు గుర్మీత్ సింగ్, హనీప్రీత్ అనే పేర్లు పెట్టుకున్నాడు. వీటిని 11,000 రూపాయలకు విక్రయించాడు. చేసిన తప్పుకు శిక్ష తప్పదని గుర్తు చేసేందుకే తన గాడిదలకు గుర్మీత్ సింగ్, హనీప్రీత్ ల పేర్లు పెట్టానని ఆయన తెలిపాడు. వాస్తవానికి వాటిని 20,000 రూపాయలకు విక్రయించాలని భావించినా డిమాండ్ రాకపోవడంతో 11,000 రూపాయలకు విక్రయించానని చెప్పాడు.