పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఏకైక కుమార్తె దినా మరణం!
- న్యూయార్క్‌లోని తన ఇంట్లో మరణించిన దినా వాడియా
- 98 ఏళ్లు జీవించిన దినా
- ఆమెకు కుమారుడు నస్లీ వాడియా, కూతురు డయానా వాడియా ఉన్నారు
1919 ఆగస్టు 15న జన్మించిన దినా వాడియా, పార్శీ కుటుంబానికి చెందిన నెవెల్లీ వాడియాను 1938లో పెళ్లి చేసుకుంది. దేశంలో ఎంతో మంది ముస్లిం అబ్బాయిలు ఉండగా పార్శీ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఎందుకని తండ్రి ఆమెను ప్రశ్నించగా... 'మరి నువ్వెందుకు పార్శీ అమ్మాయిని చేసుకున్నావ్?' అని దినా తిరిగి ప్రశ్నించిందట. మహ్మద్ అలీ జిన్నా కూడా పార్శీ కుటుంబానికి చెందిన రత్తన్ బాయిని పెళ్లిచేసుకున్నాడు.