అలా హీరోయిన్ అయిపోయాను .. ఆనందంతో ఎగిరిగంతేశాను : ప్రగతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలా హీరోయిన్ అయిపోయాను .. ఆనందంతో ఎగిరిగంతేశాను : ప్రగతి

  • మధుబాల మాదిరిగా వున్నావన్నారు 
  • సినిమా ఆఫీస్ నుంచి పిలుపు 
  • స్క్రీన్ టెస్ట్ చేసి ఓకే అన్నారు 
  • తొలి సినిమానే భాగ్యరాజాతో    
తమిళంలో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన ప్రగతి .. ఆ తరువాత తెలుగు సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ వస్తున్నారు. తెలుగులో యువ కథానాయకులకు .. కథానాయికలకు ఆమె అమ్మగా ఎక్కువ పాత్రలు చేశారు. టీనేజ్ లో ఉండగా తనకి హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వచ్చిందనే విషయాలను తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ తో పంచుకున్నారు.

"అవి నేను జూనియర్ కాలేజ్ లో కొత్తగా చేరిన రోజులు .. ఒకసారి నేను ఫ్రెండ్స్ తో ఉండగా అటుగా తమిళ నటి సి.ఆర్.సరస్వతి వచ్చారు. అది 'రోజా' సినిమా రిలీజైన సమయం .. నన్ను చూసిన ఆమె అచ్చం 'మధుబాల' మాదిరిగానే వున్నావంటూ బుగ్గ గిల్లేసింది. ఆ తరువాత మా అమ్మతో మాట్లాడి నా ఫోటో ఒకటి తీసుకెళ్లింది.

ఆ మరుసటి రోజునే సినిమా ఆఫీస్ నుంచి కాల్ రావడంతో వెళ్లాను .. యాక్టింగ్ అంటే ఇష్టమా? అని వాళ్లు అడిగితే అవునని చెప్పాను. వాళ్లు స్క్రీన్ టెస్ట్ చేసి .. సెలక్ట్ అయినట్టుగా చెప్పారు. కేరక్టర్ ఏంటి అని అడిగితే .. హీరోయిన్ అన్నారు. అంతే .. అక్కడి నుంచి బయటికి వచ్చేసి ఆనందంతో గంతులేశాను. ఆ సినిమాకి హీరో .. దర్శకుడు కె. భాగ్యరాజా" అంటూ చెప్పుకొచ్చారు.     
pragathi

More Telugu News