సెట్స్ కి వెళ్లాకే హీరో ఎవరో తెలిసింది .. అంతే ఏడుపు వచ్చేసింది!: నటి ప్రగతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెట్స్ కి వెళ్లాకే హీరో ఎవరో తెలిసింది .. అంతే ఏడుపు వచ్చేసింది!: నటి ప్రగతి

  • తల్లి పాత్రలు చేస్తూ వెళుతున్నాను 
  • హీరోకి తల్లిపాత్ర అని చెప్పడంతో ఓకే అన్నాను 
  • షూటింగ్ కి వెళ్లాక విషయం తెలిసింది
  • అప్పటి నుంచి అలా చేస్తున్నాను
తెలుగు తెరపై అమ్మా .. అక్క .. వదిన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోన్న నటిగా ప్రగతికి మంచి పేరు వుంది. అలాంటి ప్రగతి .. తాను కన్నీళ్లు పెట్టుకున్న ఒక సందర్భాన్ని గురించి ఐ డ్రీమ్స్ తో పంచుకున్నారు. " అందరూ మదర్ కేరక్టర్స్ కి పిలుస్తున్నారు .. చేస్తూ వెళుతున్నాను. ఒక సినిమాలో హీరోకి మదర్ కేరక్టర్ అని చెప్పారు .. నా పాత్ర వేష ధారణ .. స్వభావం గురించి ఒక లైన్ చెప్పారు".

"దాంతో ఓకే చెప్పేసిన నేను .. షూటింగ్ రోజున సెట్స్ కి వెళ్లాను. అక్కడ డైరెక్టర్ గారిని పలకరించి .. సీన్ ఏమిటనేది అడిగి తెలుసుకున్నాను. హీరో ఎవరని ఆయననే అడిగాను .. ఇంకా ఆ హీరో సెట్స్ కి రాలేదేమోననుకుని". ఆయన నా వైపు చూస్తూ .. "నేనే నమ్మా" అనడంతో షాక్ అయ్యాను. ఆయనకి మదర్ గా చేయడమా అనుకుంటూ పక్కకి వెళ్లి ఏడ్చేశాను. ఆ తరువాత నుంచి నాతో చేసే ఆర్టిస్టులు ఎవరు? అనే విషయం అడిగి తెలుసుకున్నాకే ఓకే చెప్పడం మొదలుపెట్టాను" అంటూ చెప్పుకొచ్చారు.    
pragathi

More Telugu News