అనిల్ రావిపూడి కథ తెగ నచ్చేసిందట .. నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు
- 'లై' మూవీ రిజల్ట్ తో డీలాపడిన నితిన్
- కృష్ణచైతన్య దర్శకత్వంలో ఆయన తాజా చిత్రం
- ఇటీవలే ఆయనకి కథ వినిపించిన అనిల్ రావిపూడి
- త్వరలో సెట్స్ పైకి
ఈ నేపథ్యంలో ఇటీవల ఆయనకి దర్శకుడు అనిల్ రావిపూడి ఒక కథను వినిపించాడట. ఈ కథ నితిన్ కే కాదు .. ఆయన తండ్రికి కూడా బాగా నచ్చేసిందట. దాంతో తమ సొంత బ్యానర్లో ఈ సినిమా చేయడానికి వాళ్లు ఆసక్తిని చూపారని సమాచారం. 'రాజా ది గ్రేట్' తో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్న అనిల్ రావిపూడి, ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ చేస్తోన్న మూవీ పూర్తి కాగానే, ఆయనతో కలిసి సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు.