మా ప్రేమకు మా నాన్నే విలన్.. మమ్మల్ని రక్షించండి: పోలీసులను ఆశ్రయించిన బీజేపీ నేత కుమార్తె

  • సెంట్రల్ జోన్ డీసీపీని ఆశ్రయించిన తెలంగాణ బీజేపీ దళిత మోర్చా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ కుమార్తె
  • తండ్రి నుంచి రక్షించాలని ఫిర్యాదు
  • ఎన్నో ప్రేమ జంటలను విడదీశాడని, కొందర్ని హత్యలు కూడా చేశాడని ఆరోపణ
బీజేపీ దళిత మోర్చా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ కుమార్తె తన ప్రియుడితో కలిసి సెంట్రల్ జోన్ డీసీపీని ఆశ్రయించింది. తన తండ్రి ప్రసాద్ నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదు చేసింది. తన తండ్రి ఎన్నో ప్రేమ జంటలను విడదీశాడని, కొన్ని సార్లు ప్రేమించిన అబ్బాయిలను ఏకంగా హత్య చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తమ ప్రేమకు కూడా తన తండ్రే విలన్ అని తెలిపింది. తన తండ్రి నుంచి తమను రక్షించాలని ఆమె డీసీపీని కోరింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
telangana
hydrabad
central zone dcp
police complaint

More Telugu News