ram: అప్పట్లో మనకి అమ్మాయిలంటే విపరీతమైన సిగ్గు : రామ్

షార్ట్స్‌లో చూడండి
రామ్ చాలా ఎనర్జిటిక్ గా .. హ్యాండ్సమ్ గా ఉంటాడు. అందువలన సహజంగానే ఆయనకి అమ్మాయిల్లో క్రేజ్ ఎక్కువ. కాలేజ్ రోజుల్లోనూ ఆయనకి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండొచ్చని అనిపించడం సహజం. ఆ టైమ్ లో ఎవరితోనైనా క్రష్ ఉందా? ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? అనే ప్రశ్నలు ఆయనకి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురయ్యాయి. అందుకు ఆయన స్పందిస్తూ .. " నాకు అమ్మాయిలంటే విపరీతమైన సిగ్గు ఉండేది. మనం సిగ్గుపడటమేంటని అనుకుని .. అలా ఓ లుక్ ఇస్తూ అటువైపు తిరిగేసి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడిని" అన్నాడు.

"నా కోసం అమ్మాయిలు నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే .. అక్కడే నిలబడ్డ నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. వాళ్లు వెళ్లిపోయిన తరువాత ఫ్రెండ్స్ ను తిట్టేవాడిని .. ఎలా రియాక్ట్ కావాలో తెలియక. ఆ తరువాత క్రషెష్ అంటే... వున్నాయి గానీ .. ఎవరితోనూ లవ్ లో పడలేదు" అంటూ సమాధానమిచ్చాడు. ఇక పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తే .. "నా చేతిలో ఏం లేదు .. జరగాల్సి వచ్చినప్పుడు జరుగుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.        
Go Back to Shorts
ram

More Telugu News