సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రం `భరత్`... 2019 రంజాన్‌కి విడుదల
- దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్
- నిర్మాత అతుల్ అగ్నిహోత్రి
- 2018 ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం
కథ పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ అధికారికంగా ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకూడదని కొరియన్ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు నిర్మాత అతుల్ అగ్నిహోత్రి తెలిపారు. గతంలో అలీ అబ్బాస్ దర్శకత్వంలో సల్మాన్ నటించిన `బాడీగార్డ్` చిత్రం పెద్ద హిట్. అలాగే అతుల్ నిర్మాణంలో సల్మాన్ నటించిన `సుల్తాన్` కూడా పెద్ద హిట్. ఒక్క `ట్యూబ్‌లైట్` చిత్రం మినహా రంజాన్ సందర్భంగా విడుదలైన సల్మాన్ చిత్రాలన్నీ దాదాపు పెద్ద హిట్లుగానే నిలిచాయి. ఈ సెంటిమెంట్ కారణంగానే `భరత్` చిత్రాన్ని కూడా రంజాన్ పండగకు విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం సల్మాన్ నటించిన `టైగర్ జిందా హై` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.