అతనో గొరిల్లా... యాంకర్ రవి గురించి శ్రీముఖి సరదా వ్యాఖ్య!
Add ap7am to your home Screen

అతనో గొరిల్లా... యాంకర్ రవి గురించి శ్రీముఖి సరదా వ్యాఖ్య!

  • రవి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి
  • డ్యాన్స్ చేస్తుంటే నాకు కోతే కనిపిస్తుంది
  • అలీ షోలో యాంకర్ శ్రీముఖి
టీవీ షోలల్లో యాంకరింగ్ చేస్తూ, ఒకరిని ఒకరు కవ్వించుకుంటూ, అప్పుడప్పుడూ హద్దులు దాటుతుండే యాంకర్లు రవి, శ్రీముఖి ఇటీవల ఓ టీవీషోలో పాల్గొనగా, రవిపై తన అభిప్రాయాన్ని చెబుతూ శ్రీముఖి తమాషా వ్యాఖ్యలు చేసింది. ఒక్క మాటలో రవి గురించి ఏం చెబుతావని అడిగితే, "పిచ్చి" అనేసింది.

రవిని ఏ జంతువుతో పోలుస్తావని అడిగితే, "గొరిల్లా" అంది. ఎందుకని అడిగితే, మనిషి గొరిల్లా నుంచే వచ్చాడని గుర్తు చేస్తూ, రవి ఎన్నో కోతి వేషాలు వేస్తుంటాడని, రవి డ్యాన్స్ చేస్తున్నప్పుడు దూరం నుంచి చూస్తుంటే తనకు కోతే కనిపిస్తుందని చెప్పుకొచ్చింది శ్రీముఖి. కామెడీ నటుడు అలీ ప్రయోక్తగా సాగుతున్న ఓ షోలో ఇది జరిగింది.
ali
srimukhi
ravi anchors

More Telugu News